యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు
- March 14, 2017
యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. కంపెనీలు, యజమానులు తమ వద్ద పని చేసే సిబ్బంది మతపరమైన చిహ్నాలను ధరించడంపై నిషేధం విధించవచ్చునని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు బురఖాలను ధరించడంపై ఇదే తొలి తీర్పు కావడం గమనార్హం. ఫ్రాన్స్, బెల్జియంకు చెందిన ఇద్దరు మహిళలు దాఖలు చేసిన రెండు కేసుల్లో కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ తీర్పునిచ్చింది. ''ఏదైనా రాజకీయ, సైద్ధాంతిక లేదా మతపరమైన చిహ్నాన్ని బహిరంగంగా కనిపించేవిధంగా ధరించడాన్ని నిషేధించే అంతర్గత నిబంధన ప్రత్యక్ష వివక్ష కాదు'' అని పేర్కొంది. ఫిర్యాదుదారులు బురఖాలను తొలగించేందుకు నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురయ్యారు. ఇదిలావుండగా, డచ్ ఎన్నికల సందర్భంగా ముస్లింల వలసలు కీలకాంశంగా మారాయి.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







