తెలుగు నటుడి కూతురు విక్రమ్ సరసన నటించనున్నారు
- March 17, 2017
విక్రమ్ - గౌతమ్ మీనన్ 'ధ్రువ నక్షత్తిరమ్'లో మరో తెలుగమ్మాయి హీరోయిన్గా ఎంపికయింది. ఇప్పటికే 'పెళ్లి చూపులు' భామ రితూ వర్మ ఒక కథానాయికగా నటిస్తుండగా మరో కథానాయికగా ఐశ్వర్య రాజేష్‌ను తీసుకున్నారట. స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రం 'ధృవ నక్షత్తిరమ్'. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో స్పై ఏజెంట్‌గా డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నాడు విక్రమ్. ఇందులో మొదట అను ఇమ్మాన్యుయెల్‌ని కథానాయికగా అనుకున్నారు. అయితే ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో 'పెళ్లి చూపులు' భామ రితూ వర్మని ఎంపిక చేశారు. ఇప్పుడు మరో కథానాయికగా కూడా తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేశారట.
ఈ ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కుమార్తె. అలాగే కమెడియన్ శ్రీలక్ష్మికి ఈమె మేనకోడలు. చెన్నైలోనే ఉండే ఐశ్వర్య ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో నటించకపోయినా.. తమిళంలో మాత్రం 20 సినిమాల వరకూ నటించింది.
ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో అరడజను తమిళ చిత్రాలున్నాయి. తాజాగా బడా మూవీ విక్రమ్-గౌతమ్ మీనన్ 'ధృవ నక్షత్తిరమ్'లో కూడా ఛాన్స్ కొట్టేసింది. మరి విక్రమ్ సినిమాతోనైనా ఈ తెలుగమ్మాయికి బిగ్ బ్రేక్ వస్తుందేమో చూద్దాం.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్‌పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా







