బెల్లం తాళికలు
- March 22, 2017
కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి- రెండు కప్పులు, బెల్లం-ఒకటిన్నర కప్పులు, నీళ్లు-నాలుగు కప్పులు(తాలికలకు), రెండు కప్పులు(బెల్లం పాకానికి), యాలకులు-మూడు.
తయారుచేసే విధానం : ముందుగా ఒక పాత్రలో నాలుగు కప్పుల నీళ్లు పోసి అందులో బియ్యప్పిండి వేసి స్టవ్‌పై పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమం ఉప్మా మాదిరిగా తయారయ్యాక దించి చల్లార్చాలి. రెండు అరచేతుల మధ్య కొంచెం ఉడికిన బియ్యం పిండి పెట్టుకుని తాళ్ళలా సన్నగా, పొడవుగా వచ్చేలా చేసుకోవాలి. వీటిని తాళికలు అంటారు. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా చేసి ఒక ప్లేటులో ఉంచుకోవాలి. మరో పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి, అందులో బెల్లం పొడి వేసి స్టవ్‌పై పెట్టి లేత పాకం వచ్చేవరకు ఉడికించాలి. దానిలో తాళికలు వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. పాకం కాస్త చిక్కబడుతున్నప్పుడే స్టవ్ కట్టేయాలి. ఆఖర్న యాలకుల పొడి చల్లాలి. ఈ బెల్లం తాళికలలో కాస్త నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటాయి. కొంతమంది ముద్దపప్పు, నెయ్యి రెండూ కలుపుకుంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







