పారిపోయిన జంట అరెస్ట్
- March 23, 2017మనామా: 55,000 బహ్రెయినీ దినార్స్ మొతాన్ని కాజేసి పారిపోయిన ఓ జంటను అదుపులోకి తీసుకున్నారు. బహ్రెయిన్‌లోని పలు కంపెనీలను ఈ జంట మోసం చేసినట్లు అభియోగాలున్నాయి. ఇండియాకి చెందిన ఈ జంట, బహ్రెయిన్‌లో పలు కంపెనీలను మోసం చేసి, ఇండియాకి పారిపోగా, ఇండియన్ అథారిటీస్ ఈ జంటను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు అబ్దుల్ హకీమ్ అతని భార్య నసీమా బివి భారతదేశంలోఇన కేరళ రాష్ట్రంలో అరెస్టయ్యారు. ఈ జంట కారణంగా మోసానికి గురైన మొహమ్మద్ జలాల్ అండ్ సన్స్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. సదరు కంపెనీ నుంచి వేలాది దినార్ల విలువైన ఖరీదైన సిగరెట్స్‌ని కొనుగోలు చేశారు. వాటిని ఇతరులకు అమ్మి తద్వారా వచ్చిన సొమ్ముతో స్వదేశానికి పారిపోయారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్‌లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్‌లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!







