ఎమిరేట్స్ ఎ 380 అడుగుభాగాన ప్రయాణించిన చిన్న విమానం కూలిపోయే స్థితి

- March 23, 2017 , by Maagulf
ఎమిరేట్స్ ఎ 380 అడుగుభాగాన ప్రయాణించిన చిన్న విమానం కూలిపోయే స్థితి

సిడ్నీకి ప్రయాణిస్తున్న ఒక ఎమిరేట్స్ ఎ 380 విమానం వెయ్యి అడుగుల దిగువలో ఒక చిన్న ప్రైవేట్ విమానం అకస్మాత్తుగా రావడంతో ఆ చిన్న విమానం అనియంత్రిత కుదుపులకు లోనై దాదాపు కూలిపోయే స్థాయికి చేరుకొంది. అబూధాబీ ప్రాంతంలో జనవరి 7 వ తేదీన జరిగిన ఈ అనూహ్య ఘటనపై జర్మనీ సమాఖ్య బ్యూరో ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. నాడు అరేబియా సముద్రం పై ఎగురుతున్న   కాణాదాయ్ర్  ఛాలెంజర్ 604 చిన్న విమానం, ఎమిరేట్స్ ఎ 380 పెద్ద విమానం అడుగుభాగాన1000 అడుగుల కింద ఉన్నపట్టకి చిన్న విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడం ఈ నేపథ్యంలో ఆకాశంలో అల్లకల్లోలం జరిగి ఆ  చిన్న విమానం 10 వేల అడుగుల కిందకు నెట్టివేయబడిందని దర్యాఫ్తులో వెల్లడి కాబడింది.ఆ స్థితిలో నియంత్రణ చేసిన పైలట్లు చిన్నవిమానంను తమ ఆధీనంలోకి ఎట్టకేలకు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత ఆ విమానంను మస్కట్ కు మళ్లించారు. ఆ నివేదిక ప్రకారం, తీవ్ర ఒత్తిడికి గురైన  పలువురు ప్రయాణీకులను ఆసుపత్రికి తరలించారు. ఒకరు తీవ్రమై గాయాల పాలయ్యారు .ఎమిరేట్స్ విమాన ఘటనపై విచారణ జరుగుతున్న సమయంలో మరింత సమాచారం వెలువడదని   గమనించాలని అధికారులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com