ఎమిరేట్స్ ఎ 380 అడుగుభాగాన ప్రయాణించిన చిన్న విమానం కూలిపోయే స్థితి
- March 23, 2017
సిడ్నీకి ప్రయాణిస్తున్న ఒక ఎమిరేట్స్ ఎ 380 విమానం వెయ్యి అడుగుల దిగువలో ఒక చిన్న ప్రైవేట్ విమానం అకస్మాత్తుగా రావడంతో ఆ చిన్న విమానం అనియంత్రిత కుదుపులకు లోనై దాదాపు కూలిపోయే స్థాయికి చేరుకొంది. అబూధాబీ ప్రాంతంలో జనవరి 7 వ తేదీన జరిగిన ఈ అనూహ్య ఘటనపై జర్మనీ సమాఖ్య బ్యూరో ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. నాడు అరేబియా సముద్రం పై ఎగురుతున్న కాణాదాయ్ర్ ఛాలెంజర్ 604 చిన్న విమానం, ఎమిరేట్స్ ఎ 380 పెద్ద విమానం అడుగుభాగాన1000 అడుగుల కింద ఉన్నపట్టకి చిన్న విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడం ఈ నేపథ్యంలో ఆకాశంలో అల్లకల్లోలం జరిగి ఆ చిన్న విమానం 10 వేల అడుగుల కిందకు నెట్టివేయబడిందని దర్యాఫ్తులో వెల్లడి కాబడింది.ఆ స్థితిలో నియంత్రణ చేసిన పైలట్లు చిన్నవిమానంను తమ ఆధీనంలోకి ఎట్టకేలకు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత ఆ విమానంను మస్కట్ కు మళ్లించారు. ఆ నివేదిక ప్రకారం, తీవ్ర ఒత్తిడికి గురైన పలువురు ప్రయాణీకులను ఆసుపత్రికి తరలించారు. ఒకరు తీవ్రమై గాయాల పాలయ్యారు .ఎమిరేట్స్ విమాన ఘటనపై విచారణ జరుగుతున్న సమయంలో మరింత సమాచారం వెలువడదని గమనించాలని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







