కొత్త ఎక్సైజ్‌ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

- March 23, 2017 , by Maagulf
కొత్త ఎక్సైజ్‌ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

కొత్త ఎక్సైజ్‌ పాలసీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. 2017 నుంచి 2019 వరకు కొనసాగనున్న ఈ కొత్తపాలసీలో వైన్‌షాపు లైసెన్స్‌ ఫీజులు భారీగా తగ్గించింది. 4,380 వైన్‌షాపులకు లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించిన సర్కారు, లాటరీ పద్ధతిలో వైన్‌ షాపుల కేటాయించబోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలు, మండల కేంద్రాల్లో వైన్‌షాపులు ఏర్పాటు చేయబోతున్నారు. 5 వేల జనాభా వరకు రూ.7.50 లక్షలు, 5-10 వేల జనాభా వరకు రూ.8.50 లక్షలు, 10-25 వేల జనాభా వరకు రూ.9.25 లక్షలు, 25-50 వేల జనాభా వరకు రూ.10 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల వరకు రూ.11.25 లక్షలు, 3-5 లక్షల జనాభా వరకు రూ.12.50 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో రూ.16.25 లక్షలు ఫీజుగా వసూలు చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com