ఫేక్ ప్రొఫైల్ తో 2600 మంది అబ్బాయిలకు గేలం వేసిన యువతి

- March 23, 2017 , by Maagulf
ఫేక్ ప్రొఫైల్ తో 2600 మంది అబ్బాయిలకు గేలం వేసిన యువతి

మగవారి చేతిలో పెళ్లి పేరుతో మోసపోతున్న ఆడవారి గురించి ఎక్కువగా వార్తలు వింటున్నాం.. కానీ బెంగళూరు కు చెందిన ఓ యువతి దేశ వ్యాప్తంగా ఏకంగా 2600 మంది అబ్బాయిలకు గేలం వేసింది.. తన పేరు తో పాటు.. ఫోటోను కూడా మార్చి మాట్రిమోనియల్ సైట్ లో పెట్టి యువకులకు వల వేయడానికి ఫేక్ డీటైల్స్ ఇచ్చింది.. ఆమె ప్రోఫైల్ దేశవ్యాప్తంగా 2600 మంది లైక్ చెయ్యడంతో పాటు వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చారు. కాగా కొంత మంది యువకులకు గేలమ్ వేసి వారి నుంచి లక్షలకు లక్షలు డబ్బులు గుంజింది. అసలు మోసం బయపడి బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే...
బెంగళూరు కు చెందిన శ్రీలత అనే యువతి ఇంటర్‌నెట్‌ నుంచి అందమైన యువతి ఫొటో డౌన్‌లోడ్‌ చేసుకుంది. అనతరం ఆ ఫోటోని ఉపయోగించి ఓ మాట్రిమోనియల్‌ సైట్‌లో తన పేరు సుస్మిత అంటూ రిజిస్టర్‌ చేసుకుంది. 
ఆ ప్రొఫైల్‌లో తనది హైదరాబాద్‌ అని వయసు 25 ఏళ్లని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ.. నెలకు రూ.1.5 లక్షల జీతం సంపాదిస్తున్నానని ఫేక్ డీటైల్స్ ఇచ్చింది. ఆమె ప్రొఫైల్‌ ను దేశ వ్యాప్తంగా 2600 మంది లైక్‌ చేయడంతో పాటు వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అలా శ్రీలత కు ఆకర్షితులైన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులున్నారు. శ్రీలత అలియాస్ సుస్మిత యువకుడితో కొన్ని రోజులు ఫోన్‌లో మాట్లాడింది... అనతరం ఓ రోజు తన పర్సు పోగొట్టుకున్నానంటూ రూ.40 వేలు అడిగింది. అప్పటికే ఆమెను పూర్తిగా నమ్మిన సదరు యువకుడు నగదు బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేశాడు. అనంతరం కొన్ని రోజులకు సుస్మిత మళ్లీ డబ్బు అడగటంతో అనుమానం వచ్చిన ఆ యువకుడు సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు డబ్బు డిపాజిట్‌ అయిన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేశారు. ఈ దర్యాప్తు సాగుతుండగానే నగరానికి చెందిన మరో 'సుస్మిత' బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించాడు. కొంతకాలం మాట్లాడిన ఆమె తన సమీప బంధువు చనిపోయాడంటూ రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయించుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. 'సుస్మిత'
డబ్బు డిపాజిట్‌ చేయించుకోవడానికి తన సోదరుడి ఖాతాను వాడింది. నగర యువకుడితో సంభాషించడానికి సుస్మిత వాడిన ఫోన్‌ నెంబర్‌ను శ్రీలత సోదరుడికి చూపించి అధికారులు ఆరా తీయగా… తన సోదరికి ఫోన్ నెంబర్ అని శ్రీలత ఫోటో చూపించాడు. శ్రీలత అసలు ఫోటోను చూసిన బాధితులు షాక్ తిన్నారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శ్రీలతను బుధవారం అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.  
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com