శుక్రవారం కార్మికులు విధిగా సెలవు పొందాలి : మంత్రిత్వశాఖ
- March 27, 2017
ప్రవాసి కార్మికుల హక్కుల గురించి అవగాహన పెంచటానికి కొనసాగుతున్న ఒక ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా, అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, శ్రామిక మరియు సాంఘిక వ్యవహారముల శాఖ శుక్రవారం రోజున కార్మికులు పని చేయరాదని ఒక వారంలో ఒక రోజుని సెలవుగా ఇవ్వాలని యజమానులు కోరింది. కార్మిక చట్టంలో అధికరణం సంఖ్య 75 ను ఈ సందర్భంగా ఉటంకిస్తూ మంత్రిత్వశాఖ ట్విట్టర్లో ప్రతి కార్మికుడు ఒక వారం రోజుల పని అనంతరం ఒక రోజు విశ్రాంతి ఉండాలని పేర్కొన్నారు.ఇది కనీస 24 వరుసగంటల విశ్రాంతి ఉండాలని ఆ రోజు పూర్తిగా వేతనం చెల్లించాలని పేర్కొంది. శుక్రవారం ఉండాలి షిఫ్ట్ లో పనిచేసేవాళ్ళు మినహా మిగిలిన కార్మికులంతా శుక్రవారం సెలువు లో ఉండాలని సూచించింది. కార్మిక చట్టంలో అధికరణం సంఖ్య 75 ప్రకారం, ఒక కార్మికుడు10 విభిన్న సందర్భాలలో పూర్తిగా వేతన చెల్లింపుతో కూడిన సెలవు రోజులు పొందేందుకు అర్హులని, దీనితో పాటు ఈద్ అల్ ఫిట్ కు మూడు రోజులు మరియు ఈద్ అల్ అధా కు మరో మూడు రోజులు సెలవలు పొందుతూ మరియు జాతీయ దినోత్సవం ఒక రోజు సెలవలు పొందేందుకు కార్మికులకు హక్కు ఉందని పేర్కొన్నారు మిగిలిన మూడు రోజుల సెలవుల గురించి యజమానులు ప్రకటించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!









