ఉచిత క్రెడిట్ కార్డులు ఎస్బీఐ ఖాతాదారులకు
- March 29, 2017క్రెడిట్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు ఉచిత క్రెడిట్ కార్డులు అందిస్తామని ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. ఖాతాలో రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు నిల్వ ఉంచుతున్న వినియోగదారులు ఈ ఉచిత క్రెడిట్ కార్డులను పొందొచ్చని, నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా వాడుకోవచ్చని ఎస్బీఐ చీఫ్ తెలిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 'ఉన్నతి' అనే పథకం ద్వారా ఈ ఉచిత క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. వినియోగదారుడి క్రెడిట్ హిస్టరీతో సంబంధం లేకుండా..
ఖాతాలో రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు నిల్వ ఉంచుతున్న వారికి ఈ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నారు. ఖాతాల్లో కనీస నిల్వలు ఉండాల్సిందేనని ఇటీవల ఎస్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎస్బీఐ ప్రకటనపై ఖాతాదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేక వచ్చింది. 'మా డబ్బుపై మీ పెత్తనం ఏమిటి?' అని ఎస్బీఐని నిలదీశారు. ఈ నేపథ్యంలో... వినియోగదారులే ఖాతాల్లో నిల్వలు ఉంచేలా చేసేందుకు ఈ ఉచిత క్రెడిట్ కార్డును ఎస్బీఐ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







