జ్యువెలరీ మాఫియా ఉగాది 'పేరు'తో

- March 29, 2017 , by Maagulf
జ్యువెలరీ మాఫియా ఉగాది 'పేరు'తో

చైత్ర శుద్ధ పాడ్యమి రోజొచ్చే ఉగాదిని ఈసారి విదియ రోజు జరుపుకోవడమే ఒక విచిత్రం. ఇలా పండగెప్పుడనే గొడవ ప్రతి సంవత్సరమూ ఉండేదే. అయితే ఈసారి పండగ పేరులో కూడా వివాదం పుట్టేసింది. ఈ ఉగాది నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరం పేరేంటన్న చర్చతోనే పండగంతా గడిచిపోతోంది. హేవిళంబి అని ఒకరు.. కాదు హేమలంబి అని ఇంకొకరు.. ఇదోరకం వాదులాట.
విళంబి అంటే ఆలస్యం చేయకపోవడం అని అర్థం. ఇది తర్వాతొచ్చే తెలుగు సంవత్సరం. ఇవ్వాళ మొదలైన తెలుగు సంవత్సరం పేరు హేవిళంబి. దాన్ని కాస్తా హేమలంబిగా మార్చేశారని.. వేళ్ళాడే బంగారం అంటూ దానికో అర్థం కూడా కనిపెట్టి జ్యువెలరీ వ్యాపారం పెంచుకోవడం కోసం ఒక కుట్రే జరిగిపోతోందని కొందరు ప్రవచన కర్తలు చెప్తున్న మాట.
ఇవ్వాళ బంగారం కొంటే ఈ సంవత్సరం మొత్తం మీ ఇంట్లో బంగారం వేళ్ళాడుతుందంటూ అటువైపు నుంచి ప్రచారం కూడా జరిగిపోతోంది.
అక్షయ తృతీయ పేరుతో జరిగే 'దోపిడీ' లాంటిదే ఇది కూడా ! చివరకు పంచాంగాలు, తెలుగు క్యాలెండర్ల మీద కూడా 'హేమలంబి'గానే అచ్చయిపోయింది. పాత పెద్దబాలశిక్ష తిరగేస్తే.. అందులో వుండే 60 తెలుగు సంవత్సరాల జాబితాలో తప్పితే.. మరెక్కడా 'హేవిళంబి' అనే పేరు కనిపించదు మరి!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com