జెడ్డాలో సందర్శనా పర్యటనల కోసం డబుల్ డెక్కర్ బస్సు సేవల ప్రారంభం

- March 30, 2017 , by Maagulf
జెడ్డాలో సందర్శనా పర్యటనల కోసం డబుల్ డెక్కర్ బస్సు సేవల ప్రారంభం

తొలిసారిగా ఒక డబుల్ డెక్కర్ నగర సందర్శన బస్సు సేవను మంగళవారం జెడ్డాలోని రోడ్డుపై మొదలయ్యాయి.ఇప్పుడు పర్యాటకులు మరియు నివాసితులు ఓ రెండు గంటల పర్యటన సమయంలో నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను సందర్శించ వచ్చు.ఇందుకోసం పెద్దలు 60 సౌదీ రియాళ్ళు వెచ్చించి టికెట్ కొనుక్కోవాల్సి ఉంది. అదేవిధంగా పిల్లలు 35 సౌదీ రియాళ్ళతోఒక టికెట్ కోసం చెల్లినించాల్సి ఉంది. జెడ్డా క్రోనీచ్ లో ఒక అధికారిక ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో పర్యాటక మరియు నేషనల్ హెరిటేజ్ మక్కా ప్రావీన్స్ శాఖ సౌదీ కమిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్లా అల్ మరి మరియు అల్-హోకాయిర్ గ్రూప్ వైస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బద్ర్  అల్ హోకాయిర్ హోటల్ అధికారులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులో మీడియా సిబ్బంది మరియు అధికారులు జెడ్డా లో మొదటి పర్యటనలో పాల్గొన్నారు. రెండు మార్గాలలో ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు బస్సుల్లో 30 చోట్ల ఆగేవిధంగా ఈ డబుల్ డెక్కర్  సేవలు కొనసాగుతాయి.ఈ బస్సు సేవలో అరబిక్, ఇంగ్లీషు, ఉర్దూ, స్పానిష్, జర్మన్ మరియు చైనీస్ భాషల్లో ఆయా ప్రాంతాల గురించి వివరిస్తూ ఆడియో టూర్ గైడ్ సేవలను సైతం అమర్చారు. ఈ సేవల ద్వారా పర్యాటకులకు నగరం గూర్చి ఒక విభిన్నఅవగాహన దృక్కోణం ఇస్తుందని అల్ మరి చెప్పారు.ఈ సేవల ద్వారా పర్యాటకులు విశ్రాంతితో కూడిన గమ్యం చేరుకోవచ్చు. ఈ పర్యటన ద్వారా జెడ్డా మరింత ఆకర్షణీయంగా కనబడేలా చేస్తుందని అన్నారాయన. రోజూ సందర్శనా పర్యటనలు పరిచయం జెడ్డాలో నగరం యొక్క పర్యాటక పరిశ్రమ ప్రోత్సహించడం వైపు ప్రధాన అడుగువేస్తున్నట్లు బాడెర్ అల్ హోకాయిర్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com