ఒమన్‌లో గడువు తీరిన మందుల పట్టివేత

- April 03, 2017 , by Maagulf
ఒమన్‌లో గడువు తీరిన మందుల పట్టివేత

మస్కట్‌: 200 రకాలకు పైగా గడువు తీరిన వెటరినరీ మెడిసిన్స్‌, సోహార్‌ మరియు బురౌమిలో సీజ్‌ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ అగ్రికల్చర్‌ వెల్లడించింది. మినిస్ట్రీ, కొన్ని ఫామ్స్‌ అలాగే వెటరినరీ ఫెసిలిటీస్‌పై బతినా గవర్నరేట్‌ పరిధిలో దాడులు నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగిన ఈ తనిఖీల్లో గడువు తీరిన మందులు లభ్యమయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకున్న అనంతరం, చట్టపరమైన చర్యలకోసం అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఆయా మందుల్ని కలిగి ఉన్న సంస్థలకు నోటీసులు జారీచేయడం కూడా జరిగింది. గడువు తీరిన మందుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, పౌరులు ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com