అమెరికాలో విశ్రాంతి తీసుకొంటున్న సింగర్ సుచిత్ర

- April 06, 2017 , by Maagulf
అమెరికాలో విశ్రాంతి తీసుకొంటున్న సింగర్ సుచిత్ర

సింగర్ సుచీ లీక్స్ కోలీవుడ్ పరిశ్రమను కుదిపేశాయి..  సుచి ట్విట్టర్ ఖాతాలో పలువురు వ్యక్తి గత చిత్రాలను, వీడియోలను లీక్ చేసిన సంచలనం సృష్టించిన సంగతి విధితమే.. దీంతో చాలా మంది సెలబ్రీటీలకు సుచిత్ర టార్గెట్ గా మారిందని.. టాక్ వినిపించింది. అప్పటి నుంచీ సుచి ఆచూకీ తెలియలేదు.. కొందరు చికిత్స నిమిత్తం యూఎస్ వెళ్లింది అని అనగా.. కొంత మంది ప్రముఖులు మాయం చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. కొన్ని మీడియాల్లో సూచీ ఎక్కడ ఉన్నది అంటూ వచ్చిన వార్తలతో.. ఆమె శ్రేయోభియాషుల్లోనూ.. అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది.  అయితే తాజాగా సుచిత్ర భర్త కార్తీక్ కుమార్ తన ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సుచిత్ర అమెరికాలో విశ్రాంతి తీసుకొంటున్నట్లు చెప్పాడు.. దీంతో సుచిత్ర యూఎస్ లో చికిత్స తీసుకొంటుంది అన్న వార్తల్లో క్లారిటీ వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com