భారత్‌లో బంగ్లాదేశ్ ప్రధాని హసీనా పర్యటన
- April 06, 2017
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన శుక్రవారం ప్రారంభం కానుంది. నాలుగు రోజుల ఈ పర్యటనలో రక్షణ,భద్రత, పౌర అణు ఇంధనం, ఇతర అంశాల్లో ఉభయ దేశాలు కనీసం 25 ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఏడేళ్ళ వ్యవధిలో హసీనా భారత్‌లో చేపడుతున్న తొలి పర్యటన ఇదే. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ, హసీనా మధ్య చర్చలు జరగనున్నాయి. ఉగ్రవాదాన్ని నిరోధించడం, భద్రతా సహకారాన్ని పెంపొందించుకోవడం లాంటి ప్రధానమైన అంశాలపై వారు చర్చలు జరపనున్నారు. తర్వాత వివిధ అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. ఒక ఒప్పందం ప్రకారం సైనిక సామాగ్రి సరఫరా కోసం బంగ్లాదేశ్‌కు భారత్ భారీ రుణాన్ని అందించనుంది. పౌర అణు ఇంధన సహకారంపై కుదిరే ఒప్పందాన్ని అనుసరించి బంగ్లాదేశ్‌లో అణు రియాక్టర్లు ఏర్పాటు చేయనుంది. ఖుల్నా, కోల్‌కతా మధ్య రైలు రాకపోకలను, బస్సు సర్వీసులనూ శనివారం ప్రారంభించనున్నారు. తీస్తా ఒప్పందాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తీవ్రంగ వ్యతిరేకిస్తున్నందున ఆమె అంగీకారం తెలిపాకే దీనిపై ముందుకెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!
- దుబాయ్ లో వర్క్, బిజినెస్ వల్లే 90% ట్రాఫిక్ రద్దీ..!!
- ఒకే రోజు 3,206 ట్రాఫిక్ వయోలేషన్స్ నమోదు..!!
- ఒమన్ లో వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో మహిళకు 10ఏళ్ల జైలుశిక్ష.. BD5,000 ఫైన్..!!
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!









