పవన్ 'ఇంజినీర్ బాబు' ఫస్ట్ లుక్

- April 12, 2017 , by Maagulf
పవన్ 'ఇంజినీర్ బాబు' ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ఇటీవలే కదా మొదలయింది..అప్పుడే ఫస్ట్ లుక్ ఏంటి అనుకుంటున్నారా..అదే పవన్ ఫ్యాన్స్ అభిమానం అంటే.పవన్ కు సంబదించిన ఏ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే మీడియా లో హల్చల్ చేసి అభిమానులే..పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీకి 'ఇంజినీర్ బాబు' అనే టైటిల్ బయటకు రాగానే వెంటనే ఫ్యాన్ మేడ్ పోస్టర్ రెడీ చేసి నెట్ లో వదిలారు.
ఇటీవలే విడుదలైన 'కాటమరాయుడు'లోని పవన్ స్టిల్ ఒకటి తీసుకుని దాన్నే కొత్త పోస్టర్ కోసం వాడుకున్నారు. త్రివిక్రమ్ సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రను పోషిస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు 'ఇంజినీర్ బాబు' అనే టైటిల్ పెట్టేశారు అభిమానులు. దీనికి 'ఇంటిపేరు ఒంటిపేరు అంతా ఇదే' అనే ఆసక్తికర ట్యాగ్ లైన్ కూడా జోడించడం విశేషం. పీకే 25వ సినిమా అంటూ స్టాంప్ కూడా వేయడం.. పోస్టర్ అందంగా.. స్టైలిష్ గా తీర్చిదిద్దడంతో సడెన్ గా చూస్తే ఇది ఒరిజినల్ ఫస్ట్ లుక్ పోస్టరేమో అని జనాలు అనుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీ కోసం ఎన్నడూ లేని విధంగా పవన్ దాదాపు 12 గంటలు షూటింగ్ లోనే పాల్గొంటున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com