అనుకున్నట్టే 9 న విడుదల కానున్న 'రుద్రమదేవి'...!!!

- October 01, 2015 , by Maagulf
అనుకున్నట్టే 9 న విడుదల కానున్న 'రుద్రమదేవి'...!!!

ఆరు నూరైనా రుద్రమదేవి చిత్రాన్ని ప్రకటించినట్లుగా అక్టోబర్-9నే ఈ సినిమా విడుదల చేస్తానంటున్నారు దర్శకనిర్మాత గుణశేఖర్.... త్రీడీ వర్క్ లేట్ అయినందు వల్ల 9న ఈ సినిమా త్రీడీలో రిలీజ్ కాదు అని వస్తున్న రూమర్స్ అన్నీ రూమర్సే నని... వర్క్స్ అన్నీ యుద్ధ ప్రాతిప్రదికన జరుగుతున్నాయని, అక్టోబరు 9వ తేదీన తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో 'రుద్రమదేవి' సినిమా త్రీడీలోనే విడుదల చేస్తమని దర్శకనిర్మాత గుణశేఖర్ చెబుతున్నారు... ఏ త్రీడీ ఎఫెక్ట్ కోసం సినిమా ఇంత డిలే అయిందో అదే త్రీడీ సినిమాకు హైలైట్ అవుతుందటున్నారు గుణశేఖర్... అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధానపాత్రల్లో తెరకెక్కిన 'రుద్రమదేవి' హిస్టారికల్ మూవీ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి... నిజానికి ఏ సినిమా అయినా వరుస వాయిదాలు పడుతుంటే.. ఆ సినిమాపై నెగటివ్ ప్రచారం మొదలవుతుంది...అయితే రుద్రమదేవిపై ఇప్పటి వరకూ ఎఫెక్ట్ పడలేదు. ఈ సినిమాను ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్ కూడా ఇప్పటికీ పాజిటివ్ యాంగిల్ లోనే చూస్తున్నారు.... సో 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న 'రుద్రమదేవి' సినిమా దర్శకనిర్మాత గుణశేఖర్ తో పాటు నటించిన నటీనటులకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి..!  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com