రోడ్డు ప్రమాదానికి గురైన కారు దగ్ధం

- April 15, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదానికి గురైన కారు దగ్ధం

ఉమ్‌ అల్‌ కువైన్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఉదయం 9.40 నిమిషాల సమయంలో ఉమ్‌ అల్‌ కువైన్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఆపరేషన్‌ రూమ్‌, ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకుంది. రెండు వాహనాలు ఢీ కొనడంతో ప్రమాదం జరగగా, అందులో ఓ కారుకి మంటలు అంటుకున్నాయి. ఫైర్‌ ఫైటర్స్‌ అలాగే పారామెడిక్స్‌ యాక్సిడెంట్‌ జరిగిన ప్రాంతానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. అలాగే గాయాల పాలైన వ్యక్తికి ప్రాథమిక సమాచారం అందించారు. అనంతరం అతన్ని ఖలీఫా ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు రోడ్లపై ట్రాఫిక్‌ రూల్స్‌ని పాటించాలని ఉమ్‌ అల్‌ కువైన్‌ సివిల్‌ డిఫెన్స్‌ కల్నల్‌ హస్సామ్‌ అలి మొహమ్మద్‌ బిన్‌ సుర్మ్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com