చిన్న వయస్సులోనే జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా నివారించడం ఎలా?

- October 02, 2015 , by Maagulf
చిన్న వయస్సులోనే జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా నివారించడం ఎలా?

 నివారించే మార్గాలన్నింటిని పక్కన పెట్టి, ముందుగా ఆరోగ్యంగా ఉన్న జాయింట్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుకోవడం ఎలా అని తెలుసుకోవాలి. జాయింట్స్(కీళ్ళలో)నొప్పులు లేదా వాపు లేదా ఎర్రగా ఉన్నప్పుడు ,ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. మరి ముఖ్యంగా ఆర్థరైటిస్ మరియు ఇతర మరికొన్ని ఇతర పరిస్థితుల్లో హెల్త్ చెకప్స్ తప్పనిసరిగాచేయించుకోవాలి. ఆర్థరైటిస్ వంటి విషయంలో వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జాయింట్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే హోంరెమెడీస్ క్రోనిక్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ వివిధ రకాలుగా ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాయింట్ పెయిన్ నివారించడం ఎలా? జాయింట్ పెయిన్ నివారించడంలో చాలా సింపుల్ విషయాలు హెల్తీఫుడ్స్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం మరియు సరైన భంగిమలో కూర్చోవడం వల్ల క్రమంగా జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది. వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు ఈ క్రిందివిధంగా....సాల్మన్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఇతర ఆహారాలను రెగ్యులర్ గా తినాలి. మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అరటిపండ్లు, విత్తనాలు మరియు నట్స్ వంటివి రెగ్యులర్ గాతినాలి. మీరు అనారోగ్యకరమంగా బరువు పెరుగుతుంటే, ఆ ఒత్తిడి జాయింట్స్ (కీళ్ళ)మీద పడుతుంది. దాంతో జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి . అందువల్ల, మీ ఎత్తుకు మరియు వయస్సుకు తగ్గబరువును ఎప్పుడు క్రాస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటి ముందు ముందుగా వయస్సు పెరిగేకొద్ది జాయింట్ డ్యామేజ్ కలగకుండా ఉండాలంటే చిన్న వయస్సు నుండే ఫిజికల్యాక్టివిటీస్ లో రెగ్యులర్ గా పాల్గొనాలి . ఎముకలను బలోపేతం చేయడానికి శరీరంలో ఒత్తిడి తగ్గించడానికి ఈ చిన్న పాటి వ్యాయామాలు గ్రేట్ గా సహాయపడుతాయి. రిపోర్ట్ ప్రకారం, స్మోకింగ్వ్యాధినిరోధకతను మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించేస్తుంది. అందువల్ల స్మోకింగ్ చేయడం ఆపేయడం వల్ల జాయింట్స్ హెల్త్ ను కాపాడుకోవచ్చు. అసౌకర్యంగా కూర్చొనే భంగిమ సరిగా లేనప్పుడు జాయింట్స్ఒత్తిడికి గురి అవుతాయి.కాబట్టి కూర్చొనే భంగిమ ఫర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు ఏదైనా బరువులు ఎత్తాలన్నా లేదా అవసరం అయిన పనులు చేయాలన్నా ఎముకలు మరియు జాయింట్స్ మీద ఎక్కువ ఒత్తిడిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి వల్ల శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. మీ జీవన శైలి నుండి ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి . ఒత్తిడి కీళ్ళ ఆరోగ్యానికి కూడా హనికలిగిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com