పక్షి కోసం ప్రాజెక్ట్ స్థలాన్నిమార్పు ఆదేశాలు జారీ చేసిన షేక్ మహ్మద్ ఆదేశాలు

- April 19, 2017 , by Maagulf
పక్షి కోసం ప్రాజెక్ట్ స్థలాన్నిమార్పు ఆదేశాలు జారీ చేసిన  షేక్ మహ్మద్ ఆదేశాలు

దుబాయ్ : ప్రాజెక్టుల కోసం గ్రామాలకు గ్రామాల ప్రజలను సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా బలవంతాన  తరలించడం మనం పలుమార్లు విన్నాం ..కానీ,  ఒక చిన్ని పక్షిని రక్షించడం కోసం ఓ పెద్ద ప్రాజెక్ట్ అక్కడ్నించి తరలించి తమ పెద్ద మనస్సును ఆ మాహా వ్యక్తులు సాటి ప్రాణిపై చూపి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ తరలింపు ఘనత సాధించిన  సామాజిక మీడియాకు పలువురు ప్రశంసల్ జల్ కురిపిస్తున్నారు.  ..ఒక 'రెస్క్యూ మిషన్' ఇంటర్నెట్లో లో వేలాది ప్రజల  హృదయాలను గెలుచుకుంది., వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రధానమంత్రి మరియు దుబాయ్ యొక్క పాలకుడు శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం మరియు యుఎఇ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు అబూధాబీ యొక్క క్రౌన్ యువరాజు  షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దుబాయ్ లో ఒక నిర్మాణ స్థలం  సమీపంలో వారు ఇరువురు పక్షులకు సహాయం చేశారు. షేక్ మహ్మద్ మరియు షేక్ మొహమ్మద్ గత వారం దుబాయ్ లో కలుసుకున్నారు వారు ఒక అడవి ప్రాంతానికి ప్రయాణిస్తుండగా హుబర బస్టర్డ్ పక్షిని గమనించారు.  ఒక ప్రాజెక్ట్ సైట్ సమీపంలో గుడ్లు పెట్టి పొదుగుతూ ఉండటం గమనించారు. వారు వెంటనే స్పందించి ఆ పక్షి మరియు దాని గుడ్లని రక్షించడానికి నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్ట్ ను మరొక ప్రాంటానికి  మరొక భాగం తరలించామని అక్కడివారికి ఆదేశించారు .వీడియోను ఇంస్టాగ్రాం ద్వారా లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పోస్ట్ చేసారు.  కేవలం మూడు గంటల్లో ఉప ప్రధాన మంత్రి మరియు అది నాయకులు పొగుడుతూ వందలాది వ్యాఖ్యలు 21,000 వీక్షణలు మన్నలను ఆ వీడియో పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com