వార్నింగ్‌: రోడ్లపై స్పీడ్‌ రాడార్ల ఏర్పాటు

- April 20, 2017 , by Maagulf
వార్నింగ్‌: రోడ్లపై స్పీడ్‌ రాడార్ల ఏర్పాటు

అబుదాబీ పోలీసులు, కొత్తగా రోడ్లపై ఏర్పాటు చేసిన స్పీడ్‌ రాడార్స్‌ వివరాల్ని వెల్లడించారు. నిబంధనల్ని ఉల్లంఘించి అతి వేగంతో దూసుకుపోయే వాహనదారుల పనిపట్టేందుకు పలు మార్గాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అబుదాబీ, అల్‌ అయిన్‌, వెస్టర్న్‌ రీజియన్‌ తదితర ప్రాంతాల్లో ఎంపిక చేసిన రోడ్లపై వీటిని ఏర్పాటు చేశారు. 19, 20, 21, 22, 23 తేదీల్లో ఆయా రోడ్లపై స్పీడ్‌ రాడార్స్‌ని ఏర్పాటు చేసిన దరిమిలా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిని స్పీడ్‌ రాడార్స్‌ ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకోనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com