యూట్యూబ్ ఛానల్ తో సరికొత్త వినోదాన్ని అందించబోతోన్న డిజిక్వెస్ట్
- April 23, 2017
డిజిటల్ మీడియా విప్లవం లో యూట్యూబ్ ఛానెల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.. వినోదానికి కొత్త వేదికలుగా మారుతున్నాయి. అదే దారిలో డిజిక్వెస్ట్ సంస్థ కూడా యూట్యూబ్ ఛానల్ తో సరికొత్త వినోదాన్ని అందించబోతోంది.. ఇప్పటివరకు ఇండస్ట్రీ కి సంబందించిన టెక్నికల్ విభాగం లో, డిజిటల్ విభాగం లో ఎంతో పేరు గడించిన డిజిక్వెస్ట్ సంస్థ ఇప్పుడు డిజిటల్ మీడియా రంగం లోకి కూడా ప్రవేశించింది..
ఈ ఛానల్ ప్రారంభం సందర్భంగా డిజిక్వెస్ట్ సంస్థ కి సంబంధించిన అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలిం "Strangers" ను కూడా ప్రదర్శించారు.. డిజిక్వెస్ట్ నుంచి మరిన్ని వినూత్నమైన షార్ట్ ఫిలింస్ రావాలని ఔత్సాహికులను ప్రోత్సహించే వేదిక కావాలని అతిధులు కోరారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసాద్స్ సంస్థల అధినేత శ్రీ రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న టెక్నాలజీ ని సరిగ్గా ఉపయోగించుకొని యువత మంచి క్వాలిటీ తో షార్ట్ ఫిల్మ్ తో ముందుకు రావచ్చని కోరారు..
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. డిజిటల్ ఇండస్ట్రీ ఇండియా కు వస్తుందంటే ముందు నమ్మలేం.. కాని ఇప్పుడు ఎంత డిజిటల్ మీడియా కు ఎంత ప్రాముఖ్యం ఉందొ అందరికి తెలిసిందే.. డిజిక్వెస్ట్ అధినేత బసిరెడ్డి కూడా మంచి లాభాలు ఆర్జించాలని కోరుకుంటున్నాను.
డిజిక్వెస్ట్ అధినేత బసిరెడ్డి మాట్లాడుతూ: ఇప్పుడున్న డిజిటల్ విప్లవం మనం చూస్తున్నాం. ఒక పక్క జియో పెను సంచలనం సృష్టిస్తోంది.. 12 ఏళ్ళు గా డిజిటల్ విభాగం లో సక్సెస్ అవుతూ వస్తున్నాం.. ఇప్పుడు వెబ్ మీడియా లోకి ప్రవేసిస్తున్నాం.. దీని ద్వారా కొత్తవాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించబోతున్నాం.. ఒక షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం. "భారత దేశం లో ఉన్న అవినీతి" అనే కాన్సెప్ట్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీసేందుకు యువతకు అవకాశం కల్పిస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియ జేస్తాం.. Strangers షార్ట్ ఫిలిం డైరెక్టర్ జెన్నిఫర్ మాట్లాడుతూ: ఈ షార్ట్ ఫిల్మ్ తీయటానికి బసిరెడ్డి గారు చాలా సహాయం చేసారు. ఈ యూట్యూబ్ ఛానెల్ కూడా పెద్ద విజయం కావాలని కోరారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









