మహిళల అక్రమ రవాణా: వలసదారుడి అరెస్ట్‌

- April 26, 2017 , by Maagulf
మహిళల అక్రమ రవాణా: వలసదారుడి అరెస్ట్‌

సోమాలీకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తితోపాటు నలుగురు ఇథియోపియన్‌ మహిళలూ పోలీసులకు చిక్కారు. సోమాలియా వ్యక్తి ఇథియోపియాకి చెందిన మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బిషా - ఖామిస్‌ ముషాయత్‌ రోడ్‌పై ప్రయాణిస్తున్న వాహనంలో బిషా పోలీసఱులు వీరిని కనుగొన్నారు. ఆ వాహనంలో ఓ చిన్నారి కూడా ఉండటం పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది. సోమాలియా వ్యక్తి వాహనాన్ని నడుపుతున్నాడు. వాహనంలోని వారంతా తన కుటుంబ సభ్యులేనని తొలుత పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు నిందితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ చేపట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com