జల్లాక్‌ హైవేపై ఓ లేన్‌ మూసివేత

- April 28, 2017 , by Maagulf
జల్లాక్‌ హైవేపై ఓ లేన్‌ మూసివేత

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌, జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌తో కలిసి రోడ్‌ మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌లో భాగంగా జల్లాక్‌ హైవేపై ఓ లేన్‌ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్‌ బహ్రెయిన్‌ వద్ద ఈ మూసివేత అమల్లో ఉంటుందనీ, మరో లేన్‌పై ట్రాఫిక్‌కి అనుమతిస్తున్నామని అధికారులు తెలిపారు. గురువారం ఏప్రిల్‌ 27న రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం మే 28 ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. అదీ వారాంతాల్లో మాత్రమే. రోడ్డు వినియోగదారులు, ట్రాఫిక్‌ నిబంధనల్ని పాటించి, భద్రతతో కూడిన ప్రయాణం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com