కార్పొరేట్ టాక్స్‌ను తగ్గించిన ట్రంప్ ప్రభుత్వం

- April 28, 2017 , by Maagulf
కార్పొరేట్ టాక్స్‌ను తగ్గించిన ట్రంప్ ప్రభుత్వం

అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భారీ ఎత్తున పన్నుల సంస్కరణలను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.  ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కార్పొరేట్ 35 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.  విదేశాల్లో దాచిన వేలకోట్ల డాలర్లను స్వచ్ఛందంగా ప్రకటించి వెనక్కి తెస్తే ఏకమొత్తంగా ఒకేసారి పన్ను విధిస్తారు.  స్టాండర్డ్ డిడక్షన్‌ను రెట్టింపు చేయడంతో పాటు చిన్న పిల్లలు, తమపై ఆధారపడిన వృద్ధులు ఉన్న కుటుంబాలకు పన్ను రాయితీలు కల్పించారు.  విదేశాల్లో దాచిన వేలకోట్ల డాలర్లను స్వచ్ఛందంగా ప్రకటించి వెనక్కి తీసుకుంటే ఏకమొత్తంగా ఒకేసారి పన్ను విధిస్తారు.  ఈ విధానాల వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని, ఆర్థిక వృద్ధి ఊపందుకుంటుందని భావిస్తోంది.  ఈ పన్ను ప్రతిపాదనలన్నింటిపైనా ప్రజలతో విస్తృతంగా చర్చలు జరిపి తుది ప్రతిపాదనలను ఖరారు చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com