అగ్ని ప్రమాదంలో తండ్రి, కుమారుడికి గాయాలు
- April 29, 2017
హమాద్ టౌన్‌లోని రౌండెబౌట్ వద్ద జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో ఓ కుటుంబం నిలువ నీడను కోల్పోయింది. ప్రమాద బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కుటుంబ పెద్ద, ఆయన కుమారుడు తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ కుమారుడ్ని రక్షించినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది. మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితీ ప్రస్తుతానికి విషమంగానే ఉంది. నార్తరన్ ఏరియా మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ మొహమ్మద్ బుహమౌద్, బాధితుల్ని ఆసుపత్రిలో పరామర్శించారు. అలాగే వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా వారి నివాసం కోసం ఏర్పాట్లు చేస్తామని ముహమౌద్ చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







