స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజ్‌ ప్రాజెక్ట్‌లో 80 శాతం ప్రోగ్రెస్‌

- May 03, 2017 , by Maagulf
స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజ్‌ ప్రాజెక్ట్‌లో 80 శాతం ప్రోగ్రెస్‌

ఎ3 స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజ్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్ట్‌లో 80 శాతం ప్రోగ్రస్‌ సాధించినట్లు అధికారులు తెలిపారు. ముహరాక్‌లోని 8 బ్లాక్స్‌కి, అలాగే మనామాలోని 2 బ్లాక్స్‌కి ఇది సేవలందిస్తుందని శానిటరీ ఇంజనీరింగ్‌ ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ (మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌ మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అర్బన్‌ ప్లానింగ్‌ విభాగం) నజ్హా అబో హింది చెప్పారు. 35 ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్స్‌తో 3.805 కిలోమీటర్ల మేర లాంగ్‌ కనెక్షన్స్‌తో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్‌, 239 స్టార్మ్‌ వాటర్‌ కలెక్షన్‌ పాయింట్స్‌ని కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌లో శ్రద్ధ చూపుతున్నందుకుగాను మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌ మరియు మినిస్టర్‌ ఇస్సామ్‌ బిన్‌ అబ్దుల్లా ఖలాఫ్‌కి కృతజ్ఞతలు తెలిపారు హిందీ. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com