వచ్చే ఏడాది విజయవాడ గన్నవరం నుంచీ హజ్‌యాత్ర
- May 04, 2017
హజ్ యాత్రకు వెళ్లేవారి కోసం వచ్చే ఏడాది నుంచి విజయవాడ విమానాశ్రయంలోనూ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా హజ్ యాత్ర చేపట్టే అవకాశాల్లేవనీ, అందరూ హైదరాబాద్ మీదుగా రాకపోకలు చేయాల్సి వస్తోందనీ ముస్లింల ప్రతినిధి బృందం గురువారం వెంకయ్యను కలిసి నివేదించింది. ఏటా దాదాపు 3 వేల మంది ఏపీ నుంచి హజ్‌యాత్రకు వెళ్తారని వివరించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో వెంకయ్య మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవంతిని హజ్ యాత్రికుల రాకపోకల నిమిత్తం కేటాయించేలా చూడాలని కోరారు. ఈ ఏడాది యాత్రకు సమయం మించిపోయినందువల్ల వచ్చే ఏడాది నుంచి సదుపాయం అందుబాటులోకి వచ్చేలాచూస్తామని నఖ్వీ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









