బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి వార్షిక టర్నోవర్ 10 వేల కోట్లు

- May 05, 2017 , by Maagulf
బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి వార్షిక టర్నోవర్ 10 వేల కోట్లు

పతంజలి సంస్థ రెండేళ్లలో దేశంలోని అతిపెద్ద స్వదీశీ బ్రాండ్‌గా అవతరిస్తుందని యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. పతంజలి వార్షిక టర్నోవర్ 10 వేల 561 కోట్లకు చేరిన సందర్భంగా తమ భవిష్యత్ ప్రణాళికలు వివరించారు. ప్రస్తుతం 6 వేల మంది ఉన్న తమ డీలర్ల సంఖ్యను 12 వేలకు పెంచబోతున్నట్టు చెప్పారు. 1857లో దేశంలో మొదటి స్వాతంత్ర పోరాటం ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిందని. కానీ విదేశీ సంస్థలు దేశంలో ఇప్పటికీ 50 లక్షల కోట్ల ఎకానమీని ఆక్రమించాయని అన్నారు. లాభాలను దేశం కోసం ఉపయోగించకుండా.. మన డబ్బును విదేశాలకు తరలిస్తున్నాయన్నారు. పతంజలి సామర్థ్యాన్ని 60వేల కోట్ల విలువైన ఉత్పత్తుల తయారీకి అనుగుణంగా సామర్థ్యాన్ని విస్తరిస్తామని బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ తెలిపారు. విజయనగరంలో సుగంధ ద్రవ్య యూనిట్‌ ఏర్పాటు చేస్తామని, దక్షిణాది రాష్ట్రాలకు అనువైన ఆహారోత్పత్తులు కూడా అక్కడే తయారు చేస్తామని  తెలిపారు. పతంజలి చారిటీ ద్వారా తమ సంస్థ వంద శాతం లాభాలను విద్య, పరిశోధన, గోవుల సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. అమర జవాన్ల పిల్లల కోసం ఢిల్లీలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అన్ని ఉత్పత్తుల్లో గోమూత్రం ఉపయోగిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. 5 ఔషధ ఉత్పత్తుల మినహా దేనిలోనూ గోమూత్రం ఉపయోగించడంలేదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com