ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లు

- October 06, 2015 , by Maagulf
ఇంద్రకీలాద్రిపై  దసరా ఉత్సవ ఏర్పాట్లు

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దసరాను రాష్ట్ర ఉత్సవంగా జరుపుతామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దసరా ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం ఇంద్రకీలాద్రిపై ప్రసాదాల తయారీ కేంద్రాలను, అన్నప్రసాదం ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దసరాను అత్యంత వైభవోపేతంగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేయాలని అధికారులను ఆదేశించామన్నారు. నవరాత్రుల సమయంలో వీఐపీల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 6 నుంచి 8 దాకా, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల దాకా వీఐపీలు అమ్మవారిని దర్శించుకునేందుకు నిర్ణీత దర్శనాలు నిర్ణయించామన్నారు. మహామండపాన్ని పూర్తి స్థాయిలో ఏవిధంగా వినియోగించుకోవాలో పరిశీలించాలని ఆలయ ఈవోను ఆదేశించామన్నారు.. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ నెల 19న మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం అమ్మవారికి పట్టువసా్త్రలు సమర్పిస్తారనితెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో రైతులు వేసిన పంటలు ఇంటికి చేరాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు విచ్చేసే వీఐపీలు శక్తి పీఠమైన దుర్గగుడికి విచ్చేస్తారని అందుకు తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లతో పాటుగా తగిన సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో దసరా ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సీఎం సమీక్ష జరుపుతారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com