అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం
- October 06, 2015
అగ్రిగోల్డ్ సంస్థ మరియు అను బంధ సంస్థలకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవని రాత పూర్వకంగా హామీ పత్రాలను సమర్పించాలని హైకోర్టు అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ తోపాటు ఆరుగురు డైరెక్టర్లను ఆదేశించింది. ఆస్తులను వేలం వేసేం దుకు ఢిల్లిdలోని సీఐ ఇండి యా లిమిటెడ్ (వేలం వేసే ఏజెన్సీ) కి అప్పగిస్టున్నట్లు కూడా ధర్మా సనం ప్రకటించింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వీ భట్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం మరో సారి విచారణ చేపట్టింది. విజయ వాడ సమీపంలోని అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 176 ఎకరాల భూమి జనావాసాలకు 500 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నందు వల్ల దాన్ని అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏ సంస్థ లేఅవుట్లకు అనుమతి మంజూరు సాధ్యం కాదని ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనానికి విన్నవించారు. దీని పై తాత్కాలిక సీజే స్పందిస్తూ అయితే ఈ భూమిని అభివృద్ధి చేయకుండా యథాతథంగా అమ్మివేయాలని అగ్రిగోల్డ్ సంస్థకుసూచించారు. అగ్రిగోల్డ్ సంస్థ పేర్కొన్నట్లు విజయవాడ సమీపంలోని 176 ఎకరాల భూమికి 12001300 కోట్లు బెంగుళూరు సమీపంలోని 172 ఎకరాల భూమికి 1500 కోట్ల రూపాయలు వస్తాయా అని తాత్కాలిక సీజే అనుమానం వ్యక్తం చేశారు. బెంగుళూరు, విజయవాడ భూముల విలువను ఏ ఆధారంగా నిర్ణయిస్తారని, ఎలా నిర్దారణకు రాగలరా అని తాత్కాలిక సీజే ప్రశ్నించారు. హామీ పత్రం సమర్పించిన తరువాత లెక్కించాల్సి వస్తుందని తాత్కాలిక సీజే హెచ్చరించారు. సుమారు 30 లక్షల మంది ఖాతాదారులు రూ. 600 కోట్లు పెట్టుబడిగా పెట్టారని అభిప్రాయపడిన ధర్మాసనం వడ్డీ సంగతేందని ప్రశ్నించింది. మీరు మాత్రం (అగ్రిగోల్డ్ యాజమాన్యం) ఆస్తులను అనుభవిస్తున్నారు అని వ్యాఖ్యానించింది. ఇంతలో అగ్రిగోల్డ్ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ 20 లక్షల మంది లబ్ధిదారులు ఇరవై వేల చొప్పున పెట్టుబడిగా పెట్టారని తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తుల విలువను ఎక్కువగా చూపించారని, వాటి విలువ నాలుగవ వంతు కూడా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్‌తోపాటు మరో డైరెక్టర్ కోర్టుకు హాజరై అఫిడవిట్ రూపంలో ప్రమాణ ప్రతాలను సమర్పించారు. అగ్రిగోల్డ్ సంస్థ మొత్తం 300 ఆస్తులను పేర్కొనగా వాటిలో కేవలం 5 ఆస్తులను మాత్రం వేలం వేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది. వేలం వేయగా వచ్చిన సొమ్మును రిజిస్ట్రార్ జ్యుడిషియల్ పేరు మీద బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని హైకోర్టు అగ్రిగోల్డ్ సంస్థను ఆదేశించింది. భూమిని ప్లాట్లుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఖర్చును యాజమాన్యమే భరించాలని ఆదేశించింది. డబ్బు లావాదేవీలను చెక్కుల రూపంలోనే నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ స్పందిస్తూ ఆస్తులన్నింటినీ వేలం వేయడానికి కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు వేర్వేరుగా ఏజెన్సీలకు అప్పగించాలని విన్నవించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె శ్రావణ్ కుమార్ కూడా ఈ ప్రతిపాదనను సమర్థించారు. ఇంకా ఏవైనా సలహాలుంటే విచారణ తేదీనాడు ఇవ్వాలని తాత్కాలిక సీజే కోరారు. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









