RGV కి కాలం కలసి రావటం లేదు

- May 15, 2017 , by Maagulf
RGV కి కాలం కలసి రావటం లేదు

సంచలన దర్శకుడు.. వివాదల వర్మ ... సునీల్ హీరోగా తెరకెక్కించిన అప్పల్రాజు సినిమాలో లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి పిచ్చి వాగుడు వాగేవాడు..హిచ్చికాకు సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు తీసే రాంగోపాల్ వర్మ డైరెక్టరా ఖర్మ  అని తనమీద తానే సెటైర్ వేసుకొన్నాడు.. కాగా శివ, రంగీల సినిమాల తర్వాత వర్మ టాలెంట్ ని ప్రూవ్ చేసే సినిమా ఒక్కటి కూడా వర్మ స్కూల్ నుంచి రాలేదు అని చెప్పవచ్చు.. దీంతో వర్మ సినిమాలమీద దృష్టి కంటే.. సోషల్ మీడియా లో పెట్టె పిచ్చి కామెంట్స్ మీద ఫోకస్ పెట్టాడు అని కొందరు అంటుంటారు.. కాగా గత కొంత కాలంగా వర్మ బయోపిక్ లంటూ.. సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.. ఎటాక్, వంగవీటి వంటి సినిమాలతో పాటు.. భూత్ రిటర్న్స్, నాట్ ఏ లవ్ స్టోరీ, డిపార్ట్ మెంట్ వంటి సినిమాలను చెత్తగా తీసి వర్మ.. చివరకు ప్రేక్షకులు వర్మ సినిమా అంటే భయపడే విధంగా చేస్తున్నాడు.. కాగా తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో సర్కార్ 3 సినిమా తెరకెక్కించాడు.. ఎన్నో వివాదాల మధ్య రిలీజైన సర్కార్ 3 సినిమా కూడా పరమ చెత్తగా ఉన్నదని.. ప్రేక్షకులను థియేటర్ లో పెట్టి టార్చర్ చూపిస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు.. వర్మ లో సరుకు ఎప్పుడో అయ్యిపోయిందని.. ఇక సినిమాలకు దర్శకత్వం వహించడం మానేసి.. పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పోస్ట్ లు కామెంట్స్ చేసుకొంటూ కాలక్షేపం చేస్తే బాగుంటుంది అని వర్మ కు ట్విట్టర్ లో సలహాలను కూడా ఇస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com