పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'దండుపాళ్యం 2'
- May 17, 2017
శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన ‘దండుపాళ్య’ చిత్రం కన్నడలో విజయం సాధించి, రూ. 30 కోట్లు వసూళ్లు చేసింది. ‘దండుపాళ్యం’ పేరుతో తెలుగులో విడుదలైన ఇదే చిత్రం తెలుగులోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం 2’ చిత్రాన్ని నిర్మాత వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి షూటింగ్ పూర్తైంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘దర్శకుడు శ్రీనివాసరాజు చిత్రాన్ని చాలా బాగా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. షూటింగ్ పూర్తైంది. ‘దండుపాళ్యం’ను మించి ‘దండుపాళ్యం 2’ తెలుగు, కన్నడ భాషల్లో మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ మకరంద్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







