మీట్, ఫిష్ ధరల పెంపుపై కఠిన చర్యలు
- May 23, 2017
కమర్షియల్ కంప్లియన్స్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) - దుబాయ్ ఎకానమీ, డేరా ఫిష్ మార్కెట్‌లో పర్యటించింది. మార్కెట్‌లో ధరలపై ఈ సందర్భంగా వివరాలు తెలుసుకున్నారు. ఫిష్ లేదా మీట్‌ని ఫ్రోజెన్ స్టేట్‌లో విక్రయించేవారు, ఖచ్చితంగా ధరల పట్టీని అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఈ విభాగంలో ఎలాంటి అక్రమాల్నీ సహించేది లేదని సిసిసిపి డైరెక్టర్ ఆఫ్ కమర్షియల్ కంట్రోల్ అహ్మద్ అవాది హెచ్చరించారు. ఈ తరహా పర్యటనల వల్ల వ్యాపారుల సమస్యలు అర్థం చేసుకోవడానికి వీలవుతుందనీ, అలాగే వినియోగదారుల ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడం సులభతరమవుతుందని అన్నారాయన. నిబంధనలకు విరుద్ధంగా ధరల విషయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అల్ అవాది. ధరల పెంపుపై ప్రభుత్వమే తగు నిర్ణయం తీసుకుంటుందని, వ్యాపారుల సూచనల్ని పరిగణనలోకి తీసుకునేందుకు అన్ని మార్గాల్ని పరిశీలిస్తామని చెప్పారాయన.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









