హీరో ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కాస్ట్లీ అఫైర్

- May 23, 2017 , by Maagulf
హీరో ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కాస్ట్లీ అఫైర్

ప్రస్తుతం తమ్ముడు తారక్ తో ' జై లవకుశ ' ప్రొడ్యూస్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. పూరీ జగన్నాథ్ తో చేసిన 'ఇజం' ఫ్లాప్ తరువాత గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ హీరోగా రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. ఉపేంద్ర అనే న్యూ డైరెక్టర్ తో చేస్తోన్న మూవీ లాంఛింగ్ కి రెడీ అవుతోంది. మరో మూవీని సంధింగ్ స్పెషల్ గా చేయనున్నాడు కళ్యాణ్ రామ్.
ఇక మరో మూవీతో కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం రొమాంటిక్ హీరోగా మారబోతున్నాడు. సిద్దార్ద..నిత్యమీనన్ లతో '180' అనే లవ్ స్టోరీ తీసిన యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ ఓ రొమాంటిక్ ఏంటర్టైనర్ చేస్తాడట. లవ్ స్టోరీలని బ్యూటిఫుల్ పెయింటింగ్స్ లా తీసే పి.సి.శ్రీరామ్ ఈ మూవీకి పనిచేయనున్నాడు. ఇప్పటి వరకూ మాస్ యాక్షన్ సినిమాలే చేసిన కళ్యాణ్ రామ్ ఈ మూవీతో తన ఇమేజ్ మార్చుకోవడానికి ట్రై చేస్తాడట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com