ఉత్తరకొరియా చర్యలను నిరసిస్తున్నజపాన్ సహా పలు దేశాలు

- May 29, 2017 , by Maagulf
ఉత్తరకొరియా చర్యలను నిరసిస్తున్నజపాన్ సహా  పలు దేశాలు

అసలే అమారికాపై కయ్యానికి కాలు దువ్వుతూ అగ్రరాజ్యం సహనాన్ని పరిక్షిస్తోంది.  ఇప్పుడు మరో దేశం జపాన్‌ని కూడా అసహనానికి గురిచేస్తోంది.  ఈ దేశంపై మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.  జపాన్‌పై చేసిన ఈ తాజా ప్రయోగం పొరుగునున్న దేశాలకు కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.  ఉ. కొరియా చర్యలను నిలువరించేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామని జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించారు.  ఇటీవల జరిగిన జీ7 సదస్సులోనూ ఉత్తర కొరియా గురించి అమెరికాతో సహా పలు దేశాలు చర్చలు జరిపాయి.  ఉ.కొరియాను అడ్డుకునేందుకు అమెరికా ఎలాంటి చర్యలు చేపట్టినా అందుకు తాము మద్దతిస్తామని జీ7 సదస్సు సందర్భంగా జపాన్ ప్రధాని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com