2018 టీడీపీ మహానాడులో 'మహా స్కెచ్'
- May 30, 2017
బాగా రీఛార్జ్ అయ్యారు తమ్ముళ్లూ.. ఇదే ఛార్జ్ తో కంటిన్యూ అయిపోండి.. అంటూ పార్టీ క్యాడర్ ను ఉత్తేజపరిచారు టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖలో తెలుగుదేశం మహానాడు ముగింపు సందర్భంగా మాట్లాడిన బాబు.. మళ్ళీ 2018 మహానాడులో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొందామన్నారు. ఎన్నికలకు బాగా దగ్గరవుతాం కనుక.. ఆ మహానాడు పార్టీకి కీలకమన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. తెలంగాణాలో అధికారంలోకి రావడం.. ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా అధికారంలో నిలవడమే లక్ష్యాలుగా ప్రణాళికలు గీసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుందన్నారు.
రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఎన్నో సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయి ఉన్నాయని.. అశాస్త్రీయ విభజనే దానికి కారణమని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడినప్పటికీ, ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ తెచ్చుకోవడంలో కేంద్రానికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్ తన మానసపుత్రిక అని, హైటెక్ సిటీ తన ఘనతేనని చెప్పుకున్నారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీ శాశ్వతంగా నిలవాలన్నది తన ఆశయమన్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ లీడర్లు వేదికపైకి వచ్చి అధినేతకు అభినందనలు తెలిపారు. తర్వాత చంద్రబాబు ప్రసంగిస్తూ ఈ మహానాడులో 34 తీర్మానాలు ప్రవేశపెట్టామని, 94 మంది మాట్లాడారని, 27 గంటలు చర్చలు జరిగాయని వివరించారు. ఇంత సంతృప్తికరంగా ఏ మహానాడూ జరగలేదని నిర్వాహక కమిటీని అభినందించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









