బాలీవుడ్ స్టార్ హీరోకి తృటిలో తప్పిన ప్రాణగండం

- May 30, 2017 , by Maagulf
బాలీవుడ్ స్టార్ హీరోకి తృటిలో తప్పిన ప్రాణగండం

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూఖ్‌ఖాన్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబై ఫిలిం సిటీలో షూటింగ్‌ జరుగుతుండగా సెట్‌ పైభాగం(రూఫ్‌) ఒక్కసారిగా కుప్పకూలింది. షారుక్ కూర్చున్న సీటు ద‌గ్గ‌ర్లోనే శకలాలు పడిపోవడంతో అంతా ఆందోళన చెందారు.
కాగా, షారుక్ ఎలాంటి గాయాలు లేకుండా బ‌య‌ట‌ప‌డినా.. ఇద్ద‌రు సిబ్బందికి గాయాలయ్యాయి. ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనను ముంబై మిర్రర్‌ వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం కారణంగా రెండు రోజుల పాటు షూటింగ్‌ను నిలిపేశారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. షారుక్‌ స‌ర‌స‌న అనుష్క‌శ‌ర్మ‌, క‌త్రినా కైఫ్‌లు నటిస్తున్నారు. షారుక్ మ‌రుగుజ్జుగా, అనుష్క మాన‌సిక రోగిగా కనిపించబోతున్నట్లు సమాచారం. జ‌బ్ త‌క్ హై జాన్ త‌ర్వాత ఈ ముగ్గురూ క‌లిసి న‌టిస్తున్న రెండో సినిమా ఇది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com