దుబాయ్‌లో ప్రమాదాలు: ఒకరి మృతి, 14 మందికి గాయాలు
- May 31, 2017
గత కొద్ది రోజుల్లో జరిగిన పలు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. దుబాయ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గత శుక్రవారం తెల్లవారు ఝామున 3.30 నిమిషాల సమయంలో, ఓ వాహనం, ట్రాక్‌ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అల్ మక్తౌమ్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయలయ్యాయి. అదే రోజు తెల్లవారుఝామున 2 గంటలకు జరిగిన మరో ప్రమాదంలో రోడ్డుపై వెళుతున్న సైక్లిస్ట్‌ని కారు ఢీకొంది. ఇంటర్నేషనల్ సిటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరో ప్రమాదం తెల్లవారుజామున 5.15 నిమిషాలకు జరిగింది. సైక్లిస్ట్‌ని ఎస్యువి వాహనం ఢీకొనగా, సైక్లిస్ట్‌కి తీవ్రగాయాలయ్యాయి. శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం ఉదయం రెండు భస్సులు ఢీకొనగా, పలువురికి ఈ ఘటనలో గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









