మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రుద్రమదేవి

- October 10, 2015 , by Maagulf
మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రుద్రమదేవి

అక్టోబర్9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన రుద్రమదేవికి ఫస్ట్ డే కలెక్షన్స్ ఆశించినదానికంటే ఎక్కువుగానే కలెక్ట్ చేశాయి. దాదాపు 2000 థియోటర్స్ తో రుద్రమదేవి రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి హిట్ టాక్ రావటంతో, ప్రేక్షకులు ఈ మూవీని ఆధిరిస్తున్నారు. మొదటి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రుద్రమదేవి, సాయంత్రం ప్రధర్శన జరుపుకున్న షోలకి, థియోటర్స్ వద్ద ప్రేక్షకులు తాకిడి మరింతగా పెరిగింది. ఇక అమెరికాలోనూ ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి. కలెక్షన్స్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 13 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. తెలంగాణాలో 8 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్లరూపాయలను రుద్రమదేవి మూవీ కలెక్ట్ చేసింది. ఇక ఇతర ప్రాంతాలు, ఓవర్సీస్ కలెక్షన్స్ ని కలుపుకుంటే దాదాపు 4.52 కోట్ల రూపాయల వరకూ కలెక్షన్స్ ని సాధించింది. ఓవరాల్ లా రుద్రమదేవి మూవీ మొదటి రోజు కలెక్షన్స్ 17.52 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ తో ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, బాక్సాపీస్ వద్ద రుద్రమదేవి మూవీ స్ట్రాంగ్ గా మారనుందని అంటున్నారు. తెలంగాణలో దసరపండుగ సెలవులు ప్రకటించటంతో నేటి నుండి ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com