ఒమన్‌ ఎయిర్‌పోర్టుల్లో ఒమన్‌టెల్‌ సాంకేతిక సేవలు

- June 05, 2017 , by Maagulf
ఒమన్‌ ఎయిర్‌పోర్టుల్లో ఒమన్‌టెల్‌ సాంకేతిక సేవలు

సుల్తానేట్‌లో ఇంటిగ్రేటెడ్‌ టెలికమ్యూనికేషన్స్‌తో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న ఒమన్‌ టెల్‌, మస్కట్‌, సలాలా, సోహార్‌ మరియు డెక్మ్‌లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవల్ని అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సేఫ్టీ, సెక్యూరిటీ విభాగంలో సేవలను విస్తృతంగా చేపట్టడమే ఈ ఒప్పందం లక్ష్యం. వివిధ ఎయిర్‌పోర్ట్‌ల మధ్య కమ్యూనికేషన్‌ తదితర వ్యవస్థల ఏర్పాటులో ఒమన్‌ టెల్‌ కీలకంగా వ్యవహరిస్తోంది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌, ఒమన్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఓఎఎంసి), ఒమన్‌ ఎయిర్‌ వంటివాటికీ ఒమన్‌ టెల్‌ సేవలందిస్తోంది. ఎయిర్‌పోర్టులు దేశానికి గేట్‌ వేలు అనీ, అలాంటి విభాగంలో తమ సేవలు తమకెంతో గర్వకారణంగా ఉన్నాయని ఒమన్‌ టెల్‌ వర్గాలు వెల్లడించాయి. మారుమూల గ్రామాలకు సైతం ఒమన్‌ టెల్‌ సేవలు అందించే దిశగా ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com