ఖతార్‌పై ట్రంప్‌ తీరుని స్వాగతించిన సౌదీ, యూఏఈ

- June 11, 2017 , by Maagulf
ఖతార్‌పై ట్రంప్‌ తీరుని స్వాగతించిన సౌదీ, యూఏఈ

తీవ్రవాదం విషయంలో ఖతార్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల్ని సౌదీ అరేబియా, యూఏఈ స్వాగతించాయి. తీవ్రవాదానికి అందే ఆర్థిక మూలాలను ధ్వంసం చేయాల్సిందేనని ఖతార్‌కి సౌదీ, యూఏఈ ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఈ కారణంగానే ఖతార్‌తో సౌదీ, యూఏఈ సహా పలు దేశాలు సంబంధాలు తెంచుకున్నాయి. ఖతార్‌ని, తీవ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా ట్రంప్‌ ప్రకటించారు. తక్షణం ఆ చర్యలు ఆపివేయాలని ఆదేశించారు. ఖతార్‌కి వ్యతిరేకంగా తమ వద్ద ప్లాన్‌ ఉందని ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసినదే. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com