'మమ్మల్నీ అమ్నెస్టీ ద్వారా రక్షించండి'-బహ్రెయిన్
- October 12, 2015
తమను కూడా అమ్నెస్టీ ద్వారా రక్షించాలనీ, న్యాయ సహాయం అందించాలని కోరుతూ పలువరు అమ్నెస్టీని సంప్రదిస్తున్నారు. బహ్రెయిన్‌లో వర్క్ పెర్మిట్ వీసాపై వచ్చి, గడువు ముగిసిన తర్వాత కూడా దేశం విడిచి వెళ్ళకుండా, దేశంలోనే అక్రమంగా నివసిస్తున్నవారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఇలాంటివారికి సహాయం అందించేందకు అమ్నెస్టీ ప్రయత్నిస్తోంది. ఈ అమ్నెస్టీ ప్రక్రియ కూడా కొన్ని విభాగాలకే పరిమితమవగా, తమను కూడా అమ్నెస్టీ ద్వారా సమస్యల నుంచి బయటపడేయాలని కొందరు కోరుతున్నారు. జులై 1న అమ్నెస్టీ ప్రారంభమైంది. ఇండియా నుంచి 40 మంది వరకూ ఇలా అమ్నెస్టీని సంప్రదించారు. అయితే మొదట వారంతా నిబంధనలు అతిక్రమించినందుకుగాను ఫైన్ కట్టవలసి ఉంటుందని బహ్రెయిన్ అధికారులు వెల్లడించారు. బహ్రెయిన్‌లో 2010లో నిర్వహించిన అమ్నెస్టీ ద్వారా 6000 మంది కార్మికులు దేశాన్ని విడిచి వెళ్ళారు. గత ఆగస్ట్‌లో 2000 మంది ఇల్లీగల్ రెసిడెంట్స్ దేశాన్ని అమ్నెస్టీ ద్వారా విడిచారు. 8 వేలమంది తమ స్టేటస్‌ని లీగలైజ్ చేసుకున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







