ప్రకంపనలు సృట్టిస్తున్నకన్నడ సూపర్ స్టార్ సుదీప్ విడాకుల వ్యవహారం

- June 16, 2017 , by Maagulf
ప్రకంపనలు సృట్టిస్తున్నకన్నడ సూపర్ స్టార్ సుదీప్ విడాకుల వ్యవహారం

కన్నడ సూపర్ స్టార్ సుదీప్ భార్య ప్రియ వైవాహిక జీవితంలో విభేదాలు తలఎత్తడం వారు విడిపోవడానికి కర్ణాటకలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం అందరికీ తెలిసిన విషయాలే. అయితే సుదీప్ దంపతుల వైవాహిక జీవితం మళ్ళీ గాడిలో పడుతోందా ? అంటూ కన్నడ మీడియా లేటెస్ట్ గా ఊహగానాలు చేస్తోంది. దీనికి కారణం ఈమధ్య వీరిద్దరు తమ కేసు నిమిత్తం ఫ్యామిలీ కోర్ట్ కు రావడంలేదని తెలుస్తోంది.
ఈ కేసులో జూన్ 14న సుదీప్ దంపతులు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా వారు రాలేదని తెలిసింది. కోర్ట్ విచారణకు ఇలా హాజరు కాకపోవడం ఇది తొమ్మిదవసారి అని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని కోర్ట్ తీవ్రంగా పరిగణిస్తూ ఇదే పద్దతిని సుదీప్ కొనసాగిస్తే ఈకేసును కొట్టి వేస్తాము అంటూ కోర్ట్ సంకేతాలు ఇస్తోంది అంటూ కన్నడ మీడియా వార్తలు వ్రాస్తోంది.
కన్నడ హీరో సుదీప్ భార్య ప్రియల మధ్య విభేదాల కారణం నటి నిత్యామీనన్ అనే మాట బలంగా వినిపిస్తోంది. నిత్యామీనన్ తో ఉన్న అఫైర్ కారణంగా సుదీప్ దంపతుల మధ్య కలతలు చోటుచేసుకొన్నాయని అవి విడాకుల వరకు దారి తీసాయని పలు కన్నడ పత్రికలుఇప్పటికే కథనాలు ప్రచురించాయి. అయితే ఇప్పడు ఈ విడాకుల వ్యవాహారం ఈ లేటెస్ట్ టర్న్ తీసుకోవడంతో సుదీప్ తో నిత్యామీనన్ వ్యవహారం చెడిందా అన్న అనుమానాలను కన్నడ మీడియా వ్యక్తం చేస్తోంది.
అయితే మరి కొన్ని మీడియా వర్గాలు మాత్రం సుదీప్ నిత్యల మధ్య అఫైర్ ఇంకాకొనసాగుతూనే ఉంది అంటూ వార్తా కథనాలు వ్రాస్తున్నాయి. ఈమధ్య మీడియా వర్గాలకు ఎదురు పడ్డ సుదీప్ ను తన భార్య విడాకులు నిత్యామీనన్ తో ఎఫైర్ విషయమై ప్రశ్నిస్తే సుదీప్ ప్రతి వ్యక్తికి ఎదో ఒక వ్యక్తిగత సమస్య ఉంటుంది అంటూ తన సమాధానాన్ని దాటవేశాడు. కన్నడ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం విడాకుల నిమిత్తం సుదీప్ తన భార్యకు ఇవ్వాలనుకున్న 19 కోట్ల భరణం విషయమై సుదీప్ కు అతడి భార్యకు ఒక అంగీకారం కుదరక పోవడంతో ఈ ఆలస్యం జరుగుతోంది అని టాక్..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com