ఫ్రాడ్ క్యాంపెయిన్: సౌదీ ఇంటీరియర్ మినిస్ట్రీ హెచ్చరిక
- June 17, 2017
సోషల్ మీడియా వినియోగదారులు, ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న ఫ్రాడ్ క్యాంపెయిన్‌పై అప్రమత్తంగా ఉండాలని సౌదీ అరేబియా ఇంటీరియర్ మినిస్ట్రీ హెచ్చరించింది. సిరియన్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకోసం ఆర్థిక సహాయం అందించాలంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారనీ, అలాంటి వాటి పట్ల ఆకర్షితులు కారాదని సౌదీ మినిస్ట్రీ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ మరౌల్ మాట్లాడుతూ, మినిస్ట్రీకి సోషల్ మీడియా ఫ్రాడ్స్‌పై పలు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ కారణంగానే సోషల్ మీడియా వినియోగదారులకు హెచ్చరికలతో కూడిన సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా అలాంటి ఫ్రాడ్ ప్రచారాలను నిర్వహిస్తున్నట్లు కనుగొంటే సంబంధిత అధికార యంత్రాంగానికి పిర్యాదు చేయాలని తెలిపారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







