రాగి అనాస ఖీర్
- June 17, 2017
కావలసిన పదార్థాలు: రాగిపిండి - అరకప్పు, పాలు - 2 కప్పులు, బెల్లంపొడి - అరకప్పు, పండిన అనాస (ఫైనాపిల్) ముక్కలు - 1కప్పు, నేతిలో వేగించిన జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ - ఐదేసి చొప్పున, యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: రాగిపిండిలో ఒక కప్పునీరు చేర్చి సన్నని మంటపై ఉండచుట్టకుండా (జావలా) కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలను మరిగించి దానిలో ఈ రాగిజావ, బెల్లం వేసి కొద్దిగా చిక్కబడనిచ్చి దించేయాలి. ఖీరు వేడి తగ్గాక అనాసముక్కలు, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్, యాలకులపొడి వేసి కలపాలి. మంచి పోషకవిలువలున్న తియ్యతియ్యని ఈ ఖీరును ఎవరైనా ఇష్టపడతారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







