బరువు తగ్గాలా.. ఇవిగోండి టిప్స్

- June 17, 2017 , by Maagulf
బరువు తగ్గాలా.. ఇవిగోండి టిప్స్

సిట్రస్ పండ్ల జాతికి చెందిన నిమ్మపండు ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. నిమ్మరసం ద్వారా శరీరంలోని టాక్సిన్లను సులభంగా తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. శరీర బరువును తగ్గించుకోవడానికి నిమ్మరసాన్ని మాత్రమే తీసుకోకుండా.. తీసుకునే ఆహారంలో కూడా నిమ్మను ఉపయోగించాలి. ఆరెంజ్, బత్తాయి పండ్ల రసాన్ని కూడా సేవించాలి.
 తేనెలో ఆంటి-యాక్సిడెంట్లు అధికంగా ఉండటం ద్వారా కొవ్వు సులభంగా కరుగుతుంది. అందుచేత రోజువారీ డైట్‌లో తేనెను కూడా భాగం చేసుకోవాలి. రోజూ పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనెను కలుపుకుని తాగితే.. శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. బరువు కూడా తగ్గుతుంది. రోజూ అరగంట పాటు నడక, అల్పాహారం మానకుండా తీసుకోవడం ద్వారా బరువును తగ్గించవచ్చు. రాత్రిపూట అన్నాన్ని పక్కనబెట్టి.. చపాతీలు వంటివి తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com