స్మార్ట్ బ్యాలన్స్ ప్రమాదకరం
- October 13, 2015
తమ పిల్లలు స్మార్ట్ బ్యాలన్స్ (హోవర్ బోర్డ్) ఉపయోగించడం పట్ల తల్లిదండ్రులు పూర్తి అవగాహనతో, జాగ్రత్తతో వ్యవహరించాలని అబుదాబీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆరేళ్ళ ఎమిరేటీ బాలుడు హోవర్ బోర్డ్ మీద వెళుతూ కారు ప్రమాదానికి గురై చనిపోవడంతో పోలీసులు, హోవర్ బోర్డ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అబుదాబీ ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ పబ్లిక్ రిలేషన్స్ సెక్షన్ చీఫ్ కల్నల్ జమాల్ సలీమ్ అల్ అమెరి, అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. బ్యాటరీ ఆపరేటెడ్ హోవర్ బోర్డ్‌లతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన శిక్షణ తీసుకోకపోతే ప్రమాదాలు తప్పవని వారు అంటున్నారు. నిర్ణీత ప్రదేశాల్లో నిపుణుల సమక్షంలో హోవర్ బోర్డ్ వినియోగం తెలుసుకుని, ఆ తర్వాత రోడ్లపైకి రావాలనీ, వాహనాలు తిరగని ప్రదేశాల్లో మాత్రమే హోవర్ బోర్డ్ వినియోగించాలని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









