'వాసుకి' చిత్రానికి లభించిన ఫిలింఫేర్ అవార్డ్
- June 19, 2017
స్టార్ హీరోయిన్ నయనతార టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'వాసుకి'. మలయాళ చిత్రం `పుదియ నియమం` చిత్రానికి అనువాద చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార నటనకు ఈ ఏడాది ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డును నయనతార సొంతం చేసుకున్నారు. మహిళలపై జరగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్త్రీ కథాంశంతో వాసుకి సినిమా రూపొందింది. మలయాళంలో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. `వాసుకి` పేరుతో శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. లీడ్ రోల్ నయనతార చేయడంతో పాటు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్య కావడంతో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాపై ఆసక్తిని కనపరుస్తున్నారు.
నయనతారకు ఫిలింపేర్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ నెలకొంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందని నిర్మాత ఎస్.ఆర్.మోహన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్‌లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







