'ధ్రువ నక్షత్రం' కి లైన్ క్లియర్

- June 20, 2017 , by Maagulf
'ధ్రువ నక్షత్రం' కి లైన్ క్లియర్

కొంతకాలం క్రితం గౌతమ్ మీనన్ మూవీ 'ధ్రువ నక్షత్రం' అటకెక్కేసిందని వినిపించింది. కానీ, తాజా అప్ డేట్ ప్రకారం... ఈ ప్రాజెక్ట్ కు ఫుల్ స్టాప్ పడలేదని కేవలం కామానే పెట్టారని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకూ ఆసక్తి ఎక్కువే. మరోవైపు హీరో విక్రమ్ కూ టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'ధ్రువ నక్షత్రం' అనే మూవీ తెరకెక్కుతోందని తెలిసి జనరల్‌గానే తెలుగు సినీ జనాలు కూడా ఎగ్జైట్ అయ్యారు. కానీ, సినిమా షూటింగ్ పూర్తవ్వకుండానే మధ్యలో అటకెక్కేసిందని తెలిసి అప్సెట్ అయ్యారు. తాజాగా వినవచ్చిన మాట ఏమిటంటే... గౌతమ్ మీనన్ ఎలాగైనా 'ధ్రువ నక్షత్ర్రం'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడట.

'ధ్రువ నక్షత్రం' షూటింగ్ మధ్యలో గౌతమ్ మీనన్ ముందు అనుకున్న స్క్రిప్ట్ ను మార్చేయడంతో.. విక్రమ్ ఆ సినిమా నుంచి వైదొలిగాడని వినిపించింది. అయితే ప్రస్తుతం 'స్కెచ్' షూటింగ్‌తో బిజీగా ఉన్న విక్రమ్ త్వరలోనే మళ్లీ 'ధ్రువ నక్షత్రం' చిత్రానికి డేట్లు కేటాయించబోతున్నాడట. గౌతమ్, చియన్ విక్రమ్ ఓ అండర్ స్టాండింగ్ కు రావడంతో... ఈ నెల 21 నుంచి మలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవ్వబోతోందట. స్లోవేనియాలో విక్రమ్‌పై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. ఏమైనా... 'ధ్రువ నక్షత్రం' మూవీ మళ్లీ షూటింగ్ జరుపుకుంటుండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్. మరి.. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com